ఎలాంటి సమస్యా లేదు: కేజ్రీ నిర్ణయానికి చీఫ్ జస్టిస్ మద్దతు
రిజిస్ట్రేషన్ నంబర్ చివరి సంఖ్య సరి సంఖ్యగా ఉన్న వాహనాలు రోడ్డు మీదకు వచ్చిన రోజు బేసి సంఖ్య ఉన్న వాహనాలు రాకూడదని, ఇలా రోజు విడిచి రోజు వాహనాలు రోడ్డెక్కాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నుంచి మద్దతు లభించింది. "ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న 'ఆడ్ - ఈవెన్' నిర్ణయంతో న్యాయమూర్తులకు ఎటువంటి సమస్యా లేదు" అని ఆయన అన్నారు.
కాగా, జనవరి 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ప్రజా స్పందనను బట్టి కొనసాగించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తామని కేజ్రీవాల్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో తమతమ అభిప్రాయాలను వెల్లడించాలని అటు ప్రజలను, ఇటు ఎన్నో సంస్థలను ఆయన కోరారు.